సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ కి విశాఖపట్టణం కి చెందిన వేగేశ్న సురేష్ కుమార్ వర్మ సువర్ణ తేజశ్వి దంపతులు 10 గ్రాముల బంగారం కానుకగా అందించారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. అలాగే నేటి శుక్రవారం ఉదయం. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకి నంద్యాల కి చెందిన యాసం వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు కీర్తి శేషులు యాసం వీరారెడ్డి పెద్ద వీరమ్మ పేరు మీద 100,116. ఒక లక్ష నూట పదహారు రూపాయలు కానుకగా అందించారు..వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి శేషవస్త్రం ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,పాపోలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందించి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *