సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ ఫ్యామిలీలో నేడు, శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి అన్నయ్య మరియు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనందరెడ్డి(85) అనారోగ్యంతో మృతిచెందారు. మొదటి నుండి రాజకీయాలకు దూరంగా వ్యాపారవేత్తగా ఉన్న ఆనందరెడ్డి పెద్ద వయస్సు రీత్యా హైదరాబాద్‌ నివాసంలో గత కొంతకాలంగా ఉంటున్నారు. పులివెందులలో చికిత్స పొందుతూ ఆనందరెడ్డి మృతిచెందారు. నేటి శుక్రవారం సాయంత్రం పులివెందులలో జరిగే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆనందరెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరు అవుతున్నారు.. ఆయన మృతిపై పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *