సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సినీ హీరో, క్లాస్ విలన్, జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 టాక్ షోకి ఆంధ్రప్రదేశ్ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తాజాగా విడుదలైన ప్రోమోలో లోకేష్ ఎంతో హుషారుగా ‘జై బాలయ్య’ అంటూ వేదికపై సందడి చేశారు. చిన్ననాటి పాఠశాల రోజుల్లో తాను తిన్న దెబ్బల జ్ఞాపకాలను సరదాగా గుర్తు చేసుకోవడంతో పాటు, తన మావయ్య బాలకృష్ణ జీవితంలో ఎవరికి భయపడతారో? చెబుతూ ప్రోమోలో ఆసక్తిని రేకెత్తించారు. దీపావళి రోజున జీ తెలుగు ఛానెల్ లో స్ట్రీమింగ్ కానుంది ఈ ఎపిసోడ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *