సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ నుంచి ఇప్పటికే పేస్ బుక్ లో వెంకీ మామతో చిన్న చిన్న నిడివి ఉన్న ఫన్ బిట్స్ తో పాటు నేటి నుంటి మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తొలి గీతం ‘డివికి డివికి’ పూర్తి లిరికల్ వీడియోను నేడు శనివారం విడుదల చేశారు. తోడికోడళ్ల సరదా అనుబంధం నేపథ్యంలో సాగే ఈ పండుగ పాటలో కీర్తి సురేష్, కృతి శెట్టి లంగా ఓణీల్లో హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యానికి మధుప్రియ, అశ్విని తమ గాత్రంతో ప్రాణం పోశారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగకు ఇక వినోదాల విందు వడ్డించడానికి దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న హంగామా మరో స్థాయిలో ఉంది.
