సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మున్సిపాలిటీ తో పాటు ఇతర, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై, భీమవరం పట్టణ శివారు పెదమిరంలోని తన కార్యాలయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ‘కూటమి’ జిల్లా ప్రెసిడెంట్ లు టీడీపీ మంతెన రామరాజు, జనసేన కొటికలపూడి గోవిందరావు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అందరికి ఆమోద యోగ్యమైన అభ్యర్థుల గెలుపు కోసం కూటమి పార్టీల నాయకుల మధ్య సమన్వయంతో పాటు, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపామని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *