సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.నేడు, శుక్రవారం గొల్లపల్లి రిజర్వాయర్ డ్యాంలో స్నానం చేసేందుకు ఐదుగురు మహిళలు దిగగా, ఈ విషాదం చోటు చేసుకుంది. లోతూ ఎక్కువ ఉన్న చోట వారు దిగటం వారికీ ఈత రాక నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసుల, రెస్కూ సిబ్బంది మహిళల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
