సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో జరుగుతున్నా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు నేపథ్యంలో నేడు, శుక్రవారం మూలా నక్షత్రం కావడంతో శ్రీ అన్నపూర్ణ అమ్మవారు, అద్భుతమైన గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు విశేషంగా శ్రీ స్వామివారితో పాటు శ్రీ అమ్మవార్లను దర్శించుకొంటున్నారు. కుంకుమపూజలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమమాలలో పాల్గొంటున్నారు.దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ చింతలపాటి బంగార్రాజు, ఇఓ కృష్ణంరాజు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసారు.
