సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా పశ్చిమగోదావరి జిల్లా ల సరిహద్దు గ్రామమైన దొంగపిండి సముద్రతీరానికి దగ్గరగా మత్యకార కుటుంబాలు నివాసం ఉంటె . గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి బంధాల డైన్ పై ఉన్న పురాతన వంతెన పై లారీ వెళుతుండగా కుప్పకూలిపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో లక్షలాది రూపాయలతో రిపేర్లు మినహా.. బ్రిడ్జి నిర్మాణంనకు టెండర్లు పిలువగా పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇళ్ళు నిర్మాణం నకు ఇసుకతో భారీ ట్రిప్పర్ రావడం తో బ్రిడ్జికి పెద్ద గొయ్యి పడి దెబ్బతింది.. ఆ ట్రిప్పర్ కూడా కాలువలో పడిపోకుండా పైపులైన్లపై ఆధారపడింది.. ట్రిప్పర్ ఇంకా తొలగించవలసి ఉంది..ఈ నేపధ్యంలో మోటార్ సైకిళ్ళు తప్ప ఇతర వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది..కాబ్బటి ఆ రోడ్డుపై వెళ్లేవారు గమనించాలి.
