సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళనాడు ఫలితాలు ఇప్పుడు సమయం ఉదయం 11న్నర ప్రాంతానికి రాష్ట్ర వ్యాప్తంగా 4 లేదా 6 రౌండ్ల ఫలితాలు పూర్తీ అయ్యేసరికి ఉన్న ఆదిక్యతల ప్రకారం త్రిముఖ పోటీ ఉత్కంఠభరితంగా మారగా హంగ్ వచ్చే అవకాశం కూడా కాస్త కనపడుతుంది. మిగతా చివరి రౌండ్ లకు ఏమైనా పరిస్థితి మారుతుందేమో? అయితే , అందరికి షాక్ కొట్టేలా ముఖ్యంగా తమిళనాడులోని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాలలో ముందుకు దూసుకొని పోతుంది. కాబోయే సీఎం విజయ్ అన్న నిజం ఇప్పటికే ప్రకటితమౌతుంది. (Tamil Nadu Assembly Elections) .ప్రస్తుతం ట్రెండ్స్‌ను బట్టి విజయ్ నేతృత్వంలోని టీవీకే (Vijay TVK) 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత ఏడీఎంకే 71స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక, ఎవరు ఊహించని రీతిలో సీఎం స్టాలిన్ నేతృత్వంలోని అధికార డీఎంకే 50 స్థానాలలో మాత్రమే లీడింగ్‌లో ఉండి 3వ స్థానానికి పడిపోయింది. ఆధిక్యతలో కొనసాగుతుంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సీట్లు సాధించాలి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే విజయ్ టీవీకే పెద్ద పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తోంది. విజయ్ పోటీ చేసిన 2 స్థానాలలో మంచి మెజారిటీతో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ 5 స్థానాలలో, మెజారిటీతో కొనసాగుతుంది. కేంద్ర పాలిత చిన్న రాష్ట్రము పుదుచ్చేరి లో బీజేపీ విజయం సాధిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *