సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు, సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పుడు సమయం 11: 55 నిమిషాలకు ఉన్న మెజారిటీల ఫలితాలు ఆధారంగా పశ్చిమ బెంగాల్ లో తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 196 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్‌ను దాటింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ 95 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 148 సీట్లలో గెలుపొందాలి. ఇక తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీ అధికారం వైపు దూసుకొని పోతుంది.. ప్రస్తుతం 112 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. అధికారంపై 118 స్థానాలు కావాలి. ఇక అస్సాం లో మరోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. మొత్తం 126 స్థానాలలో 100 స్థానాలు బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇక కేరళలో కామ్రేడ్స్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 85 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 42 సీట్లలో మాత్రమే లీడింగ్‌లో ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లో ఉన్న 33 సీట్లకు 25 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనపరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *