సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలను నర్సాపురం వసిష్ఠ గోదావరి వద్ద వంతెన నిర్మించి కలపాలనే ప్రాజెక్ట్ ఇప్పటికే ఎన్నో సార్లు నిర్మాణం వరకు వచ్చి వాయిదా పడుతూనే ఉంది. వంతెన నిర్మాణం పలుమారులు శంకు స్థాపన వరకు వచ్చి ఆగిపోయేది. అయితే తాజగా మరోసారి ముందడుగు పడింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుండి అటువైపు , డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల మధ్య రాజుల్లంక–రామేశ్వరం వద్ద వశిష్ట గోదావరిపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణ టెండర్లు ఖరారయ్యాయి. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఆహ్వానించిన ఈ టెండర్లలో బీఆర్‌కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అత్యల్పంగా రూ.299 కోట్లకు బిడ్ దాఖలు చేసి పనులను దక్కించుకుంది. అంచనా కంటే రూ.101 కోట్లు తక్కువకు కోట్ చేయడంతో ఆ సంస్థ ఎల్–1గా నిలిచింది. నేషనల్ హైవేస్(ఎన్‌హెచ్) అధికారులు దీనికి ఆమోదముద్ర వేస్తె పనులు ప్రారంభం అవుతాయి.
