సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ తనయడు అనంత్ అంబానీ నేడు, ఆదివారం తెల్లవారు జామున కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం టీటీడీకి రీకార్డ్ స్థాయిలో రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా ప్రకటించారు. వీటితో పాటు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది. మరోవైపు.. వీకెండ్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ రేపు సోమవారం నాటి వీఐపీ, శ్రీవాణి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
