సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సరదాగా ఈతకు వెళ్లిన 8 మంది యువకులు గల్లంతు కాగా వారిలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరో నలుగురు యువకులు మత్య కారుల సహకారంతో ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురానికి చెందిన సుమారు 60 మంది పోలేరమ్మ కొలుపులు నిర్వహించుకున్న అనంతరం సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వెళ్లారు. వీరిలో ఎనిమిది మంది యువకులు సముద్రంలోకి దిగి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలల ఉద్ధృతికి నీట మునిగిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.మృతులను పాలడుగు తేజ (20), బత్తుల మహేష్ బాబు (22)గా గుర్తించారు. గల్లంతైన వారిని దేవేండ్ల విష్ణు (16), దేవేండ్ల నారాయణ (30)గా గుర్తించారు. వీరి కోసం మత్స్యకారులు, మెరైన్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *