సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు తాను కొత్తగా ఏపీలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు మీడియాలో జరుగుతున్నా ప్రచారాన్ని ఖండించారు. ఆయన నేడు, శుక్రవారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. తాను పార్టీ పెడుతున్నట్లు చేస్తున్న ప్రచారం లో వాస్తవం లేదని, అయితే మా ప్రాంతంలో జన్మించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామ రాజు పోరాట స్ఫూర్తి తో ‘తెలుగువీర లేవరా’ ( డేరింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం పేరు ఇదే ) పేరుతొ ఒక ఏజెన్సీ ని ప్రారంభించే యోచనలో ఉన్నానని, ఇది మన తెలుగు ప్రజల సమస్యలపై, లీగల్ సమస్యలు పరిష్కారం కోసం, దేవాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి స్వచ్చందం గా సహాయపడుతుందని అంతే తప్ప తాను టీడీపీ లోనే ఉంటానని,కూటమి పార్టీల సహకారంతో కొనసాగుతానని తెలిపారు. మొత్తానికి శ్రీ శ్రీ కలం నుండి ఆయన భావజాలం జోష్ కలగలసిన ‘తెలుగు వీర లేవరా’ వంటి మంచి జోష్ ఉన్న టైటిల్ తో రఘురామా తన స్వంత స్వాతంత్ర భావాలకు తోడ్పాటు అందించే భావజాలం ఉన్నవారితో ఒక వేదికను సిద్ధం చేసుకొంటున్నారు. నో డౌట్..
