సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒక ప్రక్క వేసవి ఎండలు కనివిని ఎరుగని రీతిలో గోదావరి జిల్లాలలో సైతం 46 డిగ్రీల వరకు నమోదు అవుతూ ప్రచండ వడగాల్పులు వీస్తుంటే, మరో ప్రక్క ఋతుపవనాల విస్తరణలో భాగంగా భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ ,వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో వడగాల్పులు వీస్తుండగా . . విజయనగరం, అల్లూరి మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *