సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నేడు, శనివారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు చొరవతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి హైదరాబాద్ లో నేడు, ఏర్పాట్లు చేసారు. ఒకనాటి టీడీపీ లో గురుశిష్యులుగా మెలిగిన వీరి సమావేశమంలో కీలక అంశాలు తో పాటు పోలవరం ప్రాజెక్టు కోసం ఇచ్చేసిన తెలంగాణలోని 7 మండలాలలను తిరిగి తెలంగాణాలో కలపాలని ఏపీని ఇరుకున్న పెట్టె అంశాలు ను రేవంత్ సిద్ధం చేసారు. అయితే నిజానికి అసలు శ్రీరామ పుణ్యక్షేత్రం ‘భద్రాచలం’ ఏపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లాలో భాగం.. పూర్తిగా భద్రాచలం ను ఏపీలో తిరిగి కలిపేసే డిమాండ్ ను చంద్రబాబు చేస్తే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. (రాష్ట్ర విభజన సమయంలో కెసిఆర్ ప్రభుత్వం భద్రాచలం ఇవ్వడానికి ససేమిరా అని 7 మండలాలు మాత్రం ఇవ్వడానికి అంగీకరించగా.. అప్పటి సీఎం చంద్రబాబు సమ్మతించారు.) ఈ భేటీలో షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలున్నాయి. విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం. రూ.7 వేల కోట్లు విద్యుత్తూ బకాయిలను తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే 30 సార్లు సమావేశం అయ్యారు. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 90 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలాబీడే కమిటీని వేసింది.ఈ క్రమంలోనే ఈ సమస్యలన్నింటీపై ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చ ఏ ఫలాలు ఇస్తుందో చూడాలి..
