సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్, సీనియర్ హీరోయిన్ త్రిష ల అనుబంధం ఫై వంగ్యంగా ద్వంద అర్ధాలతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. నేడు, మంగళవారం తంజావూర్ పోలీసులు చెన్నై, నీలాంగరైలోని నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉదయనిధిని తంజావూర్ తరలిస్తున్నట్లు సమాచారం. వివరాలలోకి వెళ్ళితే.. ఇటీవల తంజావూరు లో ఉదయనిధి ఒక ర్యాలీ నిర్వహించారు. నదీ జలాల పంపిణీపై ప్రసంగిస్తున్న తరుణంలో ప్రజల్లో కొందరు త్రిష.. త్రిష అంటూ నినాదాలు చేశారు. దీనికి ఉదయనిధి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారానికి దారి తీసింది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధిపై టీవీకే, బీజేపీ మండిపడ్డాయి.కేసు నమోదు అయ్యింది. తాజగా ఉదయనిధి అరెస్ట్ జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *