సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్టాక్ మార్కెట్లు ఇప్పటిలో తేరుకొనేలా లేవు, నేడు, సోమవారం కూడా భారీ భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. యూఎస్-ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడంతో గల్ఫ్ లో యుద్ధ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ చుట్టూ అనిశ్చితి కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా $108 డాలర్ల పైకి చేరాయి. భారత్ ఫై దీని ప్రభావం ఎక్కువ కావడంతో సెన్సెక్స్ నేడు,సోమవారం 1,124.02 పాయింట్లు (1.52శాతం) కోల్పోయి 72,771.72 దగ్గర ముగిసింది. నిఫ్టీ 360.25 పాయింట్లు (1.56శాతం) నష్టపోయి 22,780.25 దగ్గర స్థిరపడింది. ఇక, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.6శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.8శాతం చొప్పున పతనమయ్యాయి. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 95.98 వద్ద ముగిసింది. అయితే టాప్ గెయినర్స్ (లాభపడినవి): టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్.. మరోవైపు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో పతనం కనిపించింది.
