సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నేడు, ఆదివారం ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తున్న సమయంలో నిందితుడు ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. ఆ దాడిని అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేశ్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గాయపడిన సురేశ్‌కి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ విచారణలో హతురాలు, నిందితుడిది కోనసీమ జిల్లా సఖినేటిపల్లిగా గుర్తించారు. మరోవైపు హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
