సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుండు సూది నుండి అణుబాంబు వరకు ప్రపంచంలోని అన్ని అంశాలపై చక్కగా విశ్లేషణ చెయ్యగల మేధావి, గతంలో తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ బి ఆర్ ఎస్ అభ్యర్థులను సైతం ఓడించి స్వతంత్ర అభ్యర్థిగా లక్షలాది ఓట్లు సాధించిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల పవన్ ఫై చేసిన వివాదాస్వాద విశ్లేషణ వ్యాఖ్యలు నేపథ్యంలో.. ఏపీలోని జనసేన పార్టీ వివిధ పోలీస్ స్టేషన్ లలో పోలీస్ కేసులు పెట్టిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ సైతం , నాగేశ్వర్ ఫై సో కాల్డ్.. అంటూ పోస్ట్ లు పెట్టిన నేపథ్యంలో అయన అరెస్టుకు రంగం సిద్ధం అయ్యిందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణాలో ఒక అలజడి మొదలయింది. దీనితో నాగేశ్వర్ కూడా ఎదురుదాడికి దిగారు.. దేశంలో వందలాది IPS,IAS గ్రూప్ 1 అధికారులను తయారు చేసిన గురువును నేను.. నేను బెయిల్ తెచుకొను..అరెస్ట్ చేసుకోండి.. యుద్ధం మీరు మొదలు పెట్టారు.. నేను ముగిస్తాను.. అని హెచ్చరించారు. జనసేన టీడీపీ వారు దారుణంగా అవమానిస్తున్నారు. తెలంగాణవాడీకి ఏపీ రాజకీయాలతో ఏమిటి పని అంటున్నారు. మరి ఏపీ ప్రజలు ఎన్నుకొన్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఏపీలో ఉండకూడ హైదరాబాద్ లో ఎందుకు నివాసాలు ఉంటున్నారు? ఇక్కడ ఏమి పని? పవన్ ఇక్కడ ఎందుకు ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ కు కనీస సంస్కారం లేదు. నన్ను నా ‘జ్ఞానాన్ని’ అవమానించాడు. నా వయస్సు కూడా గౌరవించలేదు , రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిన, తెలంగాణ వాడినని నన్ను అవమానిస్తారా ?అని వాపోయారు. దీనితో తెలంగాణాలో మేధావులు, విద్యార్థి సంఘాలు , కాంగ్రెస్ పార్టీ మినహా కీలక రాజకీయ నేతలు నాగేశ్వర్ కు మద్దతుగా పిలుపు నిచ్చారు. టీఆరెస్ పార్టీ తరపున కవిత అయితే ఒక అడుగు ముందుకు వేసి నాగేశ్వర్ అరెస్ట్ జరిగితే హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు ముట్టడికి తెలంగాణ వాదులకు పిలుపు ఇచ్చారు. ఈనేపథ్యంలో నేడు, మంగళవారం హైదరాబాద్ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్ర చారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
