సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి ఒక్కరు పొదుపు పాటించాలని ప్రధాని మోడీ చేసిన సూచనలు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహిస్తున్న మహానాడు సమావేశాలలో ఈసారి బిన్నంగా ఆన్ లైన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లతో పాటు తెలంగాణ, అండమాన్, ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళ్లు అర్పించారు.తదుపరి ముందుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. మొత్తం ఆరు లక్షల మంది కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నట్లు తెలిపారు.. రాష్ట్రంలోని 1875 క్లస్టర్ల ద్వారా కార్యకర్తలు తమ ఐడీ కార్డులతో హాజరు నమోదు చేసుకున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువతకు కావలసింది గొడ్డలి వేటు కాదని… ఉద్యోగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో ‘గొడ్డలి పార్టీ’ వచ్చిందని విమర్శించారు. ‘ఐటీ నుంచి క్వాంటంకు మారడం మన నినాదం’ అంటూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపైనే తమ దృష్టి అని తెలిపారు. పార్టీ కేడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *