సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో నేడు, శుక్రవారం ప్యాక్షన్ సినిమాలో సన్నివేశాలు తలపించేలా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు రక్తసిక్తంగా మారింది. ఈ ప్రాంతంలో అధికార కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలు చోట్ల కూటమి నేతలు వైసీపీ నేతలఫై దాడులకు నామినేషన్స్ వెయ్యకుండా అడ్డుకొంటున్నారని మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు వైసీపీ నాయకులు వెళ్లగా.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంపీని, టీడీపీ కార్యకర్తలు లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీనితో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన వైసీపీ శ్రేణుల బాలగంతో కూటమి శ్రేణులు తమ వాహనాలను రాళ్లతో ద్వంసం చేస్తున్న, తమపై రాళ్ల దాడి చేస్తున్న లెక్కచేయక నామినేషన్ వేయించడానికి కార్యాలయంలో ప్రవేశించడంతో అక్కడ పెద్ద రచ్చ జరిగింది. మిదున్ రెడ్డి ఫై కూడా దాడి జరగటంతో..ఒక ఎంపీ కె రక్షణ లేకపోతె ఎలా? అని అధికారులపై మిదున్ రెడ్డి మండి.పడ్డారు. జగన్ ఫోన్ లో వారిని పరామర్శించారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తం మారటంతో ఇక ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి రంగంలోకి దిగారు. పోలీసులతో లాఠీఛార్జ్ చేయించి వందలాది టీడీపీ కార్యకర్తలు, అభిమానులను, వైసీపీ నాయకులను బయటకు పంపించారు ఇదిలా ఉండగా రాయచోటి లోని వైసీపీ ఆఫీస్ ముందు ఉన్న7 వాహనాలను కొందరు దుండగులు నిప్పు పెట్టారు. మరి కొన్ని వాహనాలు ద్వంసం చేసి తిరగబెట్టారు. ఈ ఘోర సన్నివేశాలు జాతీయ మీడియా ఛానెల్స్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అక్కడి వైసీపీ నేతలపై దాడికి కూడా దిగటంతో వైసీపీ మాజీ మంత్రి శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేసారు. ధర్మవరంలో కూడా వైసీపీ నామినేషన్స్ వేసున్న వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులపై దాడులు జరిగినట్లు, తిరుపతిలో వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి అనుచరులు కూటమి నేతలతో తలపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *