సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నాయి వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు మేయర్, పురపాలక సంఘాల చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించింది. ముందుగా మేయర్ అభ్యర్థులు చూసుకొంటే.. విజయవాడ, తిరుపతిలలో మేయర్ అభ్యర్థులుగా తాజా మాజీ మేయర్లుగా ఉన్న రాయన భాగ్మలక్ష్మి, శిరీషలకు మళ్లీ అవకాశం కల్పించింది. ఇక విజయనగరానికి కోలగట్ల శ్రావణి, విశాఖకు వరుదు కల్యాణి, ఏలూరుకు గంటా మోహన్రావు (జీఎంఆర్), మచిలీపట్నంకు లంకా జ్యోతి, ఒంగోలుకు కుప్పం ప్రసాద్, నెల్లూరుకు ఆనం విజయ్కుమార్రెడ్డి, కడపకు బండి దీప్తిరెడ్డిల పేర్లను ప్రకటించారు.ఇక 20 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు.. వారిలో ..పులివెందుల- వైఎస్ ప్రమీలమ్మ.. ఇచ్చాపురం- రాజ్యలక్ష్మి, పలాస- తలసు శ్రీపద్మ. నర్సీపట్నం- చింతకాయల అనిత, యలమంచిలి- బి.తులసి, తుని- పిట్ల రామతులసి. కొవ్వూరు- మన్నె పద్మ. రామచంద్రా పురం- నాగేశ్వరరావు. కొండపల్లి- నల్లమోతు తేజస్వీ. తెనాలి-మద్దాలి శేషాచలం. చీరాల-డాక్టర్ ఇస్తార్ల శెర్లి. మదనపల్లె-జింక చలపతి. బద్వేల్- రాచపూడి వెంకట సాయి కృష్ణ. ప్రొద్దుటూరు- పొర్రెడ్డి నరసింహారెడ్డి. ఏలేశ్వరం- జి ఆశాలత పేర్లు ప్రకటించారు.
