సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. గత సాయంత్రం ముగింపు 77,928.15 తో పోలిస్తే.. నిన్నటి సెషన్‌లోని లాభాలను కొనసాగిస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 78,000 పాయింట్ల మార్కును తాకే ప్రయత్నం చేయగా, నేటి సాయంత్రానికి ట్రేడింగ్ ముగిసే సమయానికి 166 పాయింట్స్ లాభంతో 78, 094 వద్ద ముగిసింది.ఇక నిఫ్టీ 44 పాయింట్స్ లాభంతో 24,361 వద్ద ముగిసింది.
