సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భీమవరం ప్రాంతవాసి, మన్యం వీరుడు , స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం పట్ల దానికి నేడు, శనివారం ప్రధాని మోడీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని భీమవరంలోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు యుకె విశ్వనాథ రాజు, కంతేటి వెంకటరాజు అన్నారు. భీమవరంలో 35 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అల్లూరికి ఘన నివాళులర్పించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్‌ పోర్ట్ ను ప్రారంభించడం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందన్నారు. అల్లూరి సీతారామరాజు నామకరణం చేయడం మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. చెరుకువాడ రంగసాయి, కడలి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *