సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉండేందుకు “నేతన్న భరోసా” అనే పథకాన్ని తీసుకురాబోతుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 7వ తేదీని ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం కింద అర్హులైన సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు ప్రభుత్వం రూ.25 వేల చొప్పున ఆర్థిక సాహాయం అందజేయనుంది. ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించారు దింపి చేనేత, జౌళిశాఖ ఇప్పటికే కస్తరత్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54వేల మంది అర్హులైన చేనేత కార్మికులు ఉన్నట్టు అంచనా వేసింది. సొంత మగ్గం ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
