సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కానీ ఈసారి అడపాదడపా కురిసిన వర్షమే తప్ప.. వర్షాకాలం మొదలైనా వాన జాడ కనిపించడం లేదు. సాధారణంగా జులైలో వర్షాలు భారీగా కురుస్తాయి. కానీ ఈసారి వాతావరణం చూస్తే గోదావరి జిల్లాలలో సైతం ప్రతి రోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఎల్‌నీవో ప్రభావంతో రాబోయే రోజల్లో కూడా వానలు పెద్దగా పడే అవకాశం లేదని వాతావరణశాఖ అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.. నైరుతి రుతుపవనాలు మందగించడం, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వర్షాలు ఈ సారి ముఖం చాటేశాయి. ఎదో మహారాష్ట్రలో భారీ వర్షాలు పెడటంతో గోదావరి జిల్లాల లో ప్రవహించే గోదావరి నది నిండుగా ప్రవహించడం ఒక్కటే ప్రజలకు రైతాంగం కు పెద్ద ఊరట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *