సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కోనసీమలో ఓడలరేవు గ్రామంలో ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతు రోళ్ల ప్రేమ్ కుమార్ అనే 22 ఏళ్ళ యువకుడు ఇటీవల అనంతపురంలో కియా మోటార్స్ లో ఇంటర్న్ షిప్ చేస్తూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున తమ సొంత ఊరులో బివిసి కాలేజీ వద్ద ప్లెక్సీ కట్టాలని వచ్చి గత మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ప్రేమ్‌కుమార్ మృతి చెందటం అతని మిత్రులు కూడా కరెంట్ షాక్ కు గురి అయ్యి గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందటం వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. . ఈ ఘటనపై కేరళలో చికిత్స పొందుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ స్పందిస్తూ.. యువకుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యువకుడి కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. యువకులు ఎత్తైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో, ర్యాలీల్లో స్వీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
