సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన తదుపరి మల్టి ఫ్లెక్స్ లోని కళ్యాణ మండలంలో నేడు, బుధవారం ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2 అంటే వెంటనే గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని, అభిమానులకు పండుగ రోజు అని, పవన్ కళ్యాణ్ అంటే ఆయనను నమ్ముకున్న అభిమానులకు గుండె ధైర్యమని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ.. సినిమాల్లో అయిన రాజకీయాల్లో అయిన పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక స్థానమని అన్నారు. అనంతరం 100 కి పైగా జనసేన సభ్యత్వ నమోదు లు చేసి,పార్టీకి విశిష్ట సేవలు అందించిన 83 మందికి జ్ఞాపికలను అందించి సత్కరించారు.
