సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా నిమ్మకాయల ధర దిగి వచ్చింది. వేసవిలో ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా నిమ్మ కాయల వినియోగం భారీ స్థాయిలో పెరగటంతో నిన్నటి వరకు భీమవరం మార్కెట్ లో 20 రూపాయలకు 3 కాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కేజీ ఏకంగా రూ.170-180 వరకు ధర పలికి, ఇప్పుడు ఒక్కసారిగా రూ.70 -60కి పడిపోవడంతో రిటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్ వన్ రకం కేజీ రూ.70 పలుకుతోంది. నార్త్ ఇండియాలో ఇటీవల నిమ్మ కాయలు ఉత్పత్తి ఎక్కువ కావడంతో ఆ ప్రభావం ఇక్కడ పడింది. ఇప్పటికే అధిక ధరలకు కొనుగోలు చేసి ధర తగ్గిపోవడంతో రిటైల్ వ్యాపారాలుకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటి వరకు రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోవడంతో స్థానిక రైతులు ఇక ఫై . ధర మరింత తగ్గిపోయే పరిస్ధితి ఉందని తెలియడం తో విచారం వ్యక్తం చేస్తున్నారు
