సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా,నల్లజర్ల మండలం వీరవల్లిలో నేడు, బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్‌గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు చాల వేగంగా ఢీకొట్టింది. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడి పరిస్థితి చాల విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వచ్చి మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
