సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటిస్తునారు,, సీఎం చంద్రబాబు నేటి సోమవారం ఉదయం 11 గంటలకు సిద్ధాంతం గ్రామానికి చేరుకొన్నారు.. బహిరంగ సభ ప్రాంగణానికి వచ్చే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన (అగ్రికల్చర్ స్టాల్స్)ను ఆయన సందర్శిస్తారు. సరికొత్త సాంకేతికత, వ్యవసాయ పరికరాలను పరిశీలించిన అనంతరం.. ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.బహిరంగ సభ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లనున్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిపై చర్చించనున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు జిల్లా నేతలు రామరాజు, తోట సీతారామ లక్ష్మి, మెంటే పార్ధ సారధి తదితరులతో జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి నేరుగా ఉండవల్లి వెళ్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *