సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో నేడు,ఆదివారం ఉదయం రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతిచెందారు. రైలు వేగంగా ఢీకొనడంతో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా?, లేక ‘ఆత్మహత్య’కు సంబంధించినదా? అనే కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *