సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో రూ.4.85 కోట్ల వ్యయంతో భీమవరం నరసయ్య అగ్రహారం నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్మించిన అత్యాధునిక సీసీ రహదారితో పాటు, రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ లైటింగ్‌ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కలసి గత రాత్రి ప్రారంభించారు. మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ,, స్థానిక ప్రజలకు నరసయ్య అగ్రహారం –ఆర్టీసీ డిపో మార్గంలో నిర్మించిన నూతన సీసీ రహదారి స్థానిక ప్రజలకు, వ్యాపారులకు, వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీర్ఘకాలికంగా మన్నికైన ఈ రహదారి వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతోపాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయని , సెంట్రల్ డివైడర్ లైటింగ్‌తో రాత్రివేళల్లో వాహనదారులకు మెరుగైన వెలుగు లభించుందని, రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు అనంతరం నరసయ్య అగ్రహారం జంక్షన్‌లో ఏర్పాటు చేసిన అమర వీరుడు అల్లూరి సీతారామరాజు నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *