సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు లోని భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంత వాణి అనే సాఫ్ట్ వెర్ ఉద్యోగం చేస్తున్న యువతిని ఒక ఆటో డ్రైవర్ కత్తి తో దాడి చెయ్యగా ఆమె త్రీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఆమె తండ్రి కొత్తపల్లి వెంకటేశ్వర రావు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. మృతురాలు కు కొర్రపాడు కు చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్ గత 15 ఏళ్లుగా పరిచయస్తుడే అని ప్రాధమిక విచారణలో తెలుస్తుంది. వారి మధ్య ఇటీవల వివాదం రావడంతో అతను నేటి ఆదివారం తెల్లవారు జామున యువతిని కత్తి తో దాడి చేసి హతమార్చినట్లు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసాక .. పోలీస్ విచారణలో పూర్తీ సమాచారం రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *