సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు వరి కోతలు పూర్తీ కావస్తున్నా నేపథ్యంలో.. దాళ్వా పంటకు నీటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2 లక్షల 28 వేల లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు ఉద్యాన పంటలకు నీరు అందిస్తామన్నారు. డిసెంబర్‌ ఒకటో తేదీ కల్లా నాట్లు పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని, జనవరి చివరి వారం నుంచి వారబంది అమలు చేస్తామని చెప్పారు. ఈ నెలలోనే అనుకూల ప్రాంతాల్లో రైతులకు కావాలిసిన నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆదేశించారు. .ఈ నెల 19, 20 తేదీల్లో తుపాన్ నేపథ్యంలో అన్ని శాఖలు ముందస్తు సన్నద్ధతతో ఉండాలని, వరి మాసూళ్లు చేసిన ధాన్యంతో పాటు చేలల్లో పంటను రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ నాగరాణి ఆదేశించారు కాల్వ లు, డ్రైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *