సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం. భీమవరం సముద్ర తీరం వెంబడి 19 కిలోమీటర్ల పరిధిలో ఇకపై వేట నిషేధ ఆజ్ఞలు తొలిగిపోవడంతో తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో మత్యసంపద వేటకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బోట్లు తీరానికి చేరుకుంటు న్నాయిగత ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజుల పాటు కేంద్రం సముద్రంలో వేటను నిషేధించింది. ఈరెండు నెలల కాలంలో సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి ఎక్కువుగా ఉంటుంది. ఈకాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద పెరుగుదల ఉండదు.. దీన్ని పరిగణలోకి తీసుకుని కేంద్రం ప్రతి ఏటా ఈ నిషేధాన్ని అమలు చేస్తూ వచ్చింది. ఈ ఏడాది వేటపై మత్స్యకా రులు గంగమ్మ తల్లికి, సముద్రుడి కరుణ ఉండాలని కోరుకొంటూ సముద్రంలోకి దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *