సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆక్వా వ్యసాయంలో అగ్రపీఠం వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం సాధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, ప్రభుత్వ సహకారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటుందని గత నెల రోజులుగా తీవ్ర స్థాయిలో ఆందోళన ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, పాలకొల్లు లో ఆక్వా రైతులు సంఘం అడ్జక్షుడు గాంధీ రాజు ఆధ్వర్యంలో రోడ్లపై అనేక బెకెట్స్ తో నడి రోడ్డుపై రొయ్యలు ను దిమ్మర పోసి,నినాదాలు చేసారు. ఆక్వా ఎక్సపోటర్స్ సిండికేట్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేసారు.. జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి బాగోలేదని రొయ్యల రేట్లు ఎక్సపోర్టర్స్ సిండికేట్ అయ్యి కేజీకి 50 నుండి 100 రూపాయలు తగ్గించేశారని, మరో ప్రక్క మెతలు అమ్మేవారు సిండికేట్ అయ్యి 100 కేజీలకు వెయ్య రూపాయలు చప్పున రేట్లు పెంచేశారని,ఎన్నిసారులు పిర్యాదులు చేసిన రాష్టప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొకపొడవడం దారుణమని, ఇదే పరిస్థితి కొనసాగితే, ఆక్వా సాగు నిలిపివేసి ‘ఆత్మ హత్యలు’ చేసుకోవడం మినహా మరో దారిలేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
