సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తల నేపథ్యంలో ప్రపంచం మొత్తం సంక్షోభంలో ఉంది. కష్టసమయంలో దేశమంతా ఏకంగా ఉండాలి. అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలి.ప్రజలు త్యాగాలు చేయండి.. దేశ భక్తిని చాటండి. కరోనా లాంటి సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ను పరిమితంగా వాడండి. ప్రజారవాణాను వినియోగించండి. వీలైనంత వరకు మెట్రోలో ప్రయాణం చేయండి.ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించండి. ఎరువులు, రసాయనాలపై అతిగా ఆధారపడకండి. ఎరువులు, రసాయనాల వినియోగం సగానికి సగం తగ్గించండి. మనం విదేశీ మారకద్రవ్య నిల్వలను కాపాడుకోవాలి. రైతులు సోలార్ పంపులను వినియోగించాలి. గుండుసూది నుంచి ప్రతిదీ విదేశీ వస్తువులు కొనొద్దు. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలి. ఏడాది పాటు విదేశీ పర్యటనలకు వెళ్లకపోవడం మంచింది. వంట నూనెల ఖర్చు తగ్గించుకోవాలి. ఏడాది పాటు బంగారం కొనడాన్ని ఆపేద్దాం. బంగారం దిగుమతులు తగ్గితేనే విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుందని” ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *