సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికై, అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యయుత పాలన సాగిస్తున్న ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని, అత్యంత విజయవంతంగా ప్రధానిగా 4,399 రోజులు రికార్డు స్థాయి పాలనను సాగిస్తున్న సందర్భంగా ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, దేశం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూనేడు, బుధవారం ఉదయం భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం లో స్వయం భువుడు , సాక్షాత్తు చంద్ర ప్రెతిష్టగా భావించే శ్రీ సోమేశ్వర స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట శ్రీనివాస వర్మ సోమేశ్వర స్వామివారికి అభిషేకం జరిపించారు. ఆ తర్వాత శ్రీ అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగారు రాజు, ఇఓ రామ కృష్ణంరాజు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *