సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేస్తూ, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల షెడ్యూల్ ప్రకటించారు. గత గురువారం పోలింగ్ పూర్తయిన ఈ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు, ఫలితాలను ఈ నవంబరు నెల 30వ తేదీన కౌంటింగ్ లో ప్రకటిస్తారు. తదుపరి ఆయా పట్టణాలలో కొత్త చైర్ పర్సన్ తో పాటు కౌన్సిల్ ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఈనేపథ్యంలో భీమవరం పట్టణంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లి గూడెం, పాలకొల్లు పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా వచ్చే డిసెంబరు 5వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఆ రోజు జరగకపోతే డిసెంబరు 6వ తేదీన నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *