సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘స్టార్ మా’ టివి ఛానెల్ లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఎంతో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ సీజన్లు సిరీస్ లో త్వరలో బిగ్ బాస్ 10 రియాలిటీ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ ఆగస్టు 15 నుంచి ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ అగ్నిపరీక్ష సీజన్ 2 కి సంబంధించిన పలు విషయాలు చర్చల్లో నిలుస్తున్నాయి. గత సీజన్‌లో కేవలం 15 ఎపిసోడ్లకే పరిమితమైన ఈ ప్రీ-షోను, ఈసారి మరింత గ్రాండ్‌గా మొత్తం 22 ఎపిసోడ్లతో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేల సంఖ్యలో వచ్చిన కామన్ మ్యాన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, మొదటి తొమ్మిది ఎపిసోడ్లలో అత్యుత్తమ కంటెస్టెంట్లను ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన 13 ఎపిసోడ్లలో ఎంపికైన వారికి కఠినమైన శారీరక (Physical), మానసిక (Mental) టాస్క్‌లు ఇచ్చి పరీక్షిస్తారు. ఈ సవాళ్లలో విజయం సాధించి, ఒత్తిడిని తట్టుకున్న వారిని మాత్రమే బిగ్ బాస్ సీజన్ 10 మెయిన్ హౌస్‌లోకి పంపుతారు. ఈసారి ఫార్మాట్‌లో పలు మార్పులు చేసి, జడ్జీల ప్యానెల్‌లో మరింత పాపులర్ అయిన బిగ్ బాస్ విన్నర్స్‌ను లేదా టాప్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతారని తెలుస్తోంది ఈ .10వ సీజన్‌కు ‘దశావతారం’ థీమ్: మరో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది బిగ్ బాస్ 10వ సీజన్ కావడంతో మేకర్స్ ‘దశావతారం’ థీమ్‌ను పరిశీలిస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి.మెయిన్ షో ప్రారంభానికి ముందే ‘అగ్నిపరీక్ష’ ద్వారా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడంలో మేకర్స్ వేసిన వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *