సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కమల్ హాసన్, సిద్దార్ధ లతో అగ్ర దర్శకుడు శంకర్ రూపొందించిన భారతీయుడు 2 సినిమా గత జూలైలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచిన‌ నేపథ్యంలో ఈ సినిమా కు సీరీస్ గా నిర్మించి సిద్ధంగా ఉంచిన భారతీయుడు 3 సినిమా విడుద‌ల‌కు ఎన్నో సమస్యలు వెంటాడుతున్నట్లు సమాచారం. . అయితే తాజాగా ఈ భారతీయుడు పార్ట్‌3పై సోష‌ల్ మీడియాలో అస‌క్తిక‌ర‌ విష‌యాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ సినిమాను థియేట‌ర్ల‌లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మాములుగా అయితే ఈ సినిమాను జ‌న‌వ‌రి 2025లో థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ముందుగానే ఫ్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ ఇప్పుడు ఆ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. భార‌తీయుడు 2 రిలీజ్ అయినప్పుడే మూడో భాగం ట్రైల‌ర్ విడుద‌ల చేసిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల నుంచి అశించిన స్పంద‌న రాలేదు. దీంతో ఈ సినిమా విడుద‌ల విష‌యంలో మేక‌ర్స్ సందిగ్దంలో ఉన్నట్లు స‌మాచారం.గతంలో కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్ వేదికలపై భారతీయుడు 3 సినిమా మరింత ఉన్నతంగా రూపొందించామని ప్రకటించడం విశేషం. ఈ సినిమా లో కమల్ హాసన్ కొన్ని సన్నివేశాలలో నడి వయస్సు వ్యక్తిగా కనిపిస్తారు. ఆయనకు జంటగా కాజల్ నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *