సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో అమెరికా సైనిక దాడిలో ఒమన్ తీరంలో జరిగిన వాణిజ్య నౌక ఘటనలో భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో నౌక లో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 21 మందిని సురక్షితంగా రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. అనంతరం గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చీఫ్ ఇంజనీర్ పటానాల సురేష్ ఇప్పటికీ కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఆయన సజీవంగా ఉండే అవకాశాలు చాల తక్కువని నిపుణులు భావిస్తున్నారు. ఈ తరహా ఘటన ఇటీవల కాలంలో 2వ సారి కావడంతో ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా అమెరికా కు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ‘సారి’ తో సరిపుచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారగా, భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పబ్లిక్ డిప్లొమసీ సెంటర్ అధిపతి ఇస్మాయిల్ బఖాయ్ భారత ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అదే సమయంలో నౌక ఘటన అమెరికా కొనసాగిస్తున్న సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనం విధానాలకు నిదర్శనమని విమర్శించారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, సముద్ర భద్రతా సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజం ఈ అంశంపై స్పందించి అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని డిమాండ్ చేసారు.
