సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం వరకు పాకిస్తాన్ ను భారత్ త్రివిధ దళాలు మిసైల్ దాడులతో తుక్కు రేగోడుతున్న నేపథ్యంలో ఇక పాపి పాకిస్తాన్ పని మరో 7 రోజులలో ముగించెయ్యచ్చు అనుకున్న సమయంలో పాకిస్తాన్ ఇక భారత్ ఫై రెచ్చగొట్టుడు పనులు చెయ్యను ..శాంతి యుత చర్చలకు సిద్ధం అని ప్రపంచానికి కలరింగ్ ఇవ్వడం తో.. నేటి సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దీ క్షణాల ముందు భారత్-పాకిస్తాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా.. సంచలన పోస్ట్ చేశారు. తాను గత రాత్రి నుండి చేస్తున్న ప్రయత్నాలు మేరకు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాక్ దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని.. సుదీర్ఘ చర్చల తర్వాత తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందన్నారు ట్రంప్.మరి దీనిని మన దేశ ప్రధాని మోడీ అధికారికంగా ద్రువీకరించవలసి ఉంది. మరో 2 రోజులు పాక్ ప్రవర్తన గమనించి అధికారికంగా ప్రకటిస్తారేమో? పాక్ ఇంకా భారత్ హస్త గతం కాకుండా భారత్ యుద్ధం విరమించడం భారతీయులలో అసంతృప్తి కలిగిస్తుంది. మరో ప్రక్క పాక్ ను హెచ్చరిస్తూనే ప్రపంచ బ్యాంకు నుండి వేల కోట్ల ఆర్ధిక సహాయం ను పాకిస్తాన్ కు తాజాగా అందిస్తుండటం ఆ దేశం ఉగ్రవాదం ప్రోచాహించానికే నని పాశ్చత్య దేశాల డబుల్ గేమ్ ను సూచిస్తుందని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు.
