సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 4 రోజులలో శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా భీమవరం పట్టణంలో వాడవాడలా స్థానిక యువత ఆధ్వర్యంలో చవితి పందిళ్ళ వేస్తున్న సందడి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు పోలీస్ అధికారులు పండుగను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకునే విధంగా పందిళ్లకు అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ , పొలీస్, మున్సిపల్ అధికారులు సమన్వయం చేసుకొని గణేష్ విగ్రహాలు ఏర్పాటుకు, మండపాలు ఏర్పాటుకు, మైక్ లు ఏర్పాటు కు అనుమతులు మంజూరు చేయాలని, డీజే సౌండ్స్ నిషేదించాలని సూచించారు. భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, డి మార్ట్ ప్రక్కన పలు కూడళ్లలో పాటు ఉండి లోని గణపవరం రోడ్డు లో ఉన్న బొమ్మల తయారీ కేంద్రాల నుండి పెద్ద సైజు అందమైన శ్రీ వినాయక విగ్రహాలు 5వేల రూపాయలు నుండి 30వేల రూపాయలు ధరల వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే భారీగా పెరిగిపోయిన ఖర్చులు నేపథ్యంలో గతంలో స్థాయి స్టాల్స్ ఏర్పాటు జరగలేదు. రవాణా చార్జీలు, పూజాసామాగ్రి, పురోహితులు పందిళ్ళ నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. పట్టణంలో వ్యాపారాలు, ప్రజలకు ఆదాయాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ భీమవరంలో వాడవాడలా అందమైన పందిళ్లు వేసి పంచమ రాత్రులు, నవత్రులు, 11 రోజులు చప్పున వారి వారి అవకాశాలు బట్టి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *