సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భీమవరంపట్టణంలో ప్రస్తుతం పురపాలక సంఘ పరిధిలో ప్రస్తుతం ఉన్న 39 వార్డులను 52 వార్డులుగా పునర్విభజిస్తూ రూపొందించిన డీలిమిటేషన్ ప్రతిపాదనలు నేడు, గురువారం ( 08-10-2026న) ప్రజల పరిశీలనార్థం పురపాలక సంఘం నోటీస్ బోర్డులో ప్రచురించబడినవి.. సదరు డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నవారు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా భీమవరం పురపాలక సంఘం కార్యాలయంలో సమర్పించాలని మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ప్రకటించారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఈ 7 రోజులు లోపు మాత్రమే తెలియజెయ్యవలసి ఉంది. అభ్యన్తరాలు సమర్పణకు చివరి తేదీ: 14-10-2026 6అభ్యంతర పత్రంలో పేరు, పూర్తి చిరునామా, సంప్రదింపు వివరాలు, సంబంధిత వార్డు/ప్రాంతం, అభ్యంతరానికి గల కారణాలు స్పష్టంగా పేర్కొని, సంబంధిత ఆధార పత్రాలను జతచేయవలెను.
