సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో 52 వార్డులలో కూటమి అభ్యర్థులే గెలవబోతున్నారని, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అశాభావం వ్యక్తం చేసారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని 32వ వార్డులో నేడు గురువారం ఎమ్మెల్యే అంజిబాబు, తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. సామాన్య ఓటరులానే పోలింగ్ బూత్ లో ఇతర ఓటర్ల తోపాటు క్యూలో నిలబడి ఎమ్మెల్యే అంజిబాబు ఓటు వేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ ఓటు వేయడం వారి బాధ్యత అని పిలుపు నిచ్చారు. తదుపరి భీమవరం పట్టణంలో పలు బూత్ ల వద్ద పోలింగ్ పరిస్థితి ని గమనించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *