సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలో ఇంకా చాల ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో.. భీమవరం నియోజక వర్గంలో అర్నబ్‌ తుపాను వచ్చి నేటి, శుక్రవారం 4 రోజులు గడుస్తున్నా ఇంకా పలు ప్రాంతాలకు విద్యుత్తూ సరఫరా పునరుద్ధరించ లేకపోవడం గమనార్హం. దీనికి ఇక్కడ తగిన స్టాప్ లేకపోవడం, స్థానికంగా ఇతర జిల్లాల ప్రెవేటు పని వారు కూడా సరిపోక పోవడంతో గత 2 రోజులుగా భీమవరంలో తెలంగాణ నుండి వచ్చిన పలువురు కార్మికులు తో విద్యుత్తూ పునరుద్ధరణ పనులు , కొత్త స్తంబాలు, కొత్త ట్రాన్సుఫార్మ్స్ ఏర్పాటు తదితర పనులు చేస్తున్నారు. నేడు, శుక్రవారం భీమవరంలో పర్యటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. విద్యుత్‌ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నేటి సాయంత్రం లోపు భీమవరం తోపాటు గ్రామాల్లో కూడా పూర్తి విద్యుత్ సరఫరాను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. భీమవరం నియోజక వర్గంలో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన 200 మందితో నేడు శుక్రవారం బ్యాంక్ కాలనీలో కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో ఎమ్మెల్యే అంజిబాబు సమీక్షించి మాట్లాడారు. . చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్ పార్మర్లు దెబ్బతిన్నాయని, తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పునరుద్ధరణ పనుల్లో భాగస్వావులవుతున్నారని అన్నారు. దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, తెగిపోయిన తీగలను సరిచేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *