సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నేడు, సోమవారం మద్యాహ్నం నుండి హరేరామ- హరే కృష్ణ.. నినాదాలు తో హోరెత్తింది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఆధ్వర్యంలో ‘శ్రీ జగన్నాధుని రధోత్సవం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వన్ టౌన్ లోని గునుపూడి పంచారామ క్షేత్రం నుండి 2 టౌన్ లోని ఏ ఎస్ ఆర్ కాలనీ లోని ఇస్కాన్ ఆశ్రమం మీదుగా అల్లూరి సీతారామరాజు సాంసృతిక మండపం వరకు ఈ రథయాత్ర నిర్వహించారు. సుమారు 4 కిలోమీటర్లు మేర రధం లాగుతూ హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తనలతో భక్తులు , మహిళలు, చిన్నారులు తరించారు. ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు శ్రీ జగన్నాధుని రథానికి స్వగతం పలికే కార్యక్రమం లో రోడ్డుపై ఉన్న పుష్పాలను చీపురు తో ఉడ్చటం రోడ్డు ను శుభ్రపర్చడం విశేషం. తదుపరి సాయంత్రం నుండి ASR మండపం లో గురువులచే శ్రీ కృష్ణ ప్రవచనాలు నిర్వహించారు.ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ప్రసాద వితరణలు పెద్ద ఎత్తున హాజరు అయిన భక్తులకు ఇస్కాన్ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు
